తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లోని మసీదులో భారీ పేలుడు- ఐదుగురు మృతి - Balochistan

పాకిస్థాన్​ బలూచిస్థాన్​ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో ప్రార్థనలు చేసేవారే లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పాక్​లోని మసీదులో భారీ పేలుడు- ఐదుగురు మృతి

By

Published : Aug 16, 2019, 7:43 PM IST

Updated : Sep 27, 2019, 5:26 AM IST

పాక్​లోని మసీదులో భారీ పేలుడు
పాకిస్థాన్​ బలూచిస్థాన్​ రాష్ట్రం కుచ్లక్​ ప్రాంతంలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయప్డడారు.

శుక్రవారం ప్రార్థనలకు వచ్చేవారే లక్ష్యంగా దాడులు చేశారు ముష్కరులు. కుచ్లక్​ ప్రాంతంలో నెల రోజుల్లోనే ఇలాంటి దాడి జరగటం ఇది నాలుగోసారి.

దాడి సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. క్షతగాత్రులను క్వెట్టా ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మసీదులో సుమారు 10 కిలోల బరువైన ఐఈడీ బాంబును పేల్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో తరచుగా తాలిబన్​, బలోచ్​ నేషనలిస్ట్ సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతుండటం వల్ల... ఇది కూడా వాటి పనేనని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్​ సమన్లు

Last Updated : Sep 27, 2019, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details