రష్యాలో కొవిడ్(Russia covid cases) విశ్వరూపం చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి కరోనా కేసులు(Corona virus in Russia) వెలుగుచూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 40 వేల 96 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 వందల 59 మరణాలు(russia corona deaths today) సంభవించాయి. వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి రష్యాలో ఇవే అత్యధికమని ఆదేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా రష్యాలో ఇప్పటివరకు 2 లక్షల 35 వేల 57 మంది బలయ్యారు.
కరోనా తీవ్రతను నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు వారం పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను(corona lockdown in russia) ప్రకటించారు. రాజధాని మాస్కోలో మాత్రం ఉద్యోగులకు శుక్రవారం నుంచే పెయిడ్ హాలిడే ప్రారంభమైంది.
వాటికి మాత్రమే అనుమతి..
వైరస్ కట్టడికి మాస్కో నగరంలో పాఠశాలలు సహా రిటైల్ అవుట్‌లెట్‌లు, రెస్టారెంట్‌లు, క్రీడా, వినోదానికి సంబంధించిన వాటన్నింటినీ మూసివేశారు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. మ్యూజియంలు, థియేటర్లకు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. క్లబ్‌లు ఇతర వినోద సంబంధిత ప్రదేశాలు మూసి ఉంచాలని, వ్యాక్సిన్ వేసుకోని వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని అధ్యక్షుడు పుతిన్(vladimir putin latest news) అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. పెయిడ్ హాలిడే ఇవ్వడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావించగా చాలామంది రష్యన్లు విహార యాత్రలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ రష్యాలోని అన్ని వినోదాత్మక ప్రాంతాలను మూసివేయించారు. ఇదే సమయంలో ఈజిప్ట్, టర్కీకు వెళ్లేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
వ్యాక్సినేషన్లో వెనుకంజ..
ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను(russia covid vaccine) తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో(russia covid vaccination rate) మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. దీనితో వ్యాక్సినేషన్ మందగించడం వల్లే కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే అంటే.. 14.6కోట్ల మందిలో 4.9కోట్ల రష్యన్లకు మాత్రమే టీకాల పంపిణీ జరిగింది.
సుదీర్ఘ ఆంక్షలు సడలింపు!
మరోవైపు.. దాదాపు 19 నెలల అనంతరం దేశ సరిహద్దులను తెరిచేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే పౌరులు కఠిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తమ పౌరులు 177 దేశాలకు వెళ్లేందుకు విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం అనుమతించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అర్హులుగా ప్రకటించింది.