తెలంగాణ

telangana

ETV Bharat / international

అలెక్సీ నావల్నీని జైలుకు పంపండి: కోర్టు ఆదేశం - అమెరికా

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి జైలు శిక్ష విధించింది మాస్కో కోర్టు. ఆయనకు రెండున్నర సంవత్సరాలకుపైగా శిక్ష విధించాలని క్రెమ్లిన్​ను ఆదేశించింది. అయితే.. ఈ చర్యను అమెరికా తప్పుబట్టింది. కోర్టు తీర్పుతో మరోసారి రష్యాలో ఆందోళనలు చెలరేగాయి.

Moscow court orders Kremlin foe Navalny to prison
అలెక్సీ నావల్నీని జైలుకు పంపండి: కోర్టు ఆదేశం

By

Published : Feb 3, 2021, 5:30 AM IST

రష్యా విపక్ష నేత, అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ ప్రత్యర్థి.. అలెక్సీ నావల్నీని జైలుకు పంపాలని మాస్కో కోర్టు మంగళవారం ఆదేశించింది. రెండున్నరేళ్ల కంటే ఎక్కువగా శిక్ష విధించాలని తన తీర్పులో చెప్పింది. ఈ మేరకు క్రెమ్లిన్​ను ఆదేశించింది.

గత ఏడాది స్వదేశంలో విష ప్రయోగానికి గురైన నావల్నీ.. జర్మనీలో దాదాపు ఐదు నెలల చికిత్సతో కోలుకున్నారు. ఈ సమయంలో నావల్నీ తనకు రష్యా విధించిన నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17న రష్యా చేరుకున్న నావల్నీని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఖండిస్తున్నారు.

కోర్టులో అలెక్సీ నావల్నీ

ఆయనను విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా రష్యా అంతగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఇంతలోనే చికిత్స సమయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంతో నావల్నీని జైలుకు పంపాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

ఖండించిన అమెరికా..

కోర్టు తీర్పు అనంతరం స్పందించిన అమెరికా.. నావల్నీని విడుదల చేయాలని పునరుద్ఘాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్బంధించిన రష్యన్​ పౌరుల్ని విడుదల చేయాలని కోరారు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్​.

కోర్టు తీర్పుతో మరోసారి పెద్ద ఎత్తున నావల్నీ మద్దతుదారులు.. రష్యన్​ వీధుల్లో నిరసనబాట పట్టారు. సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల దృష్ట్యా.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది రష్యా అధికార యంత్రాంగం.

భారీగా మోహరించిన బలగాలు
నిరసనకారుడిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు

నావల్నీని అరెస్టు చేసినప్పటినుంచీ ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 6 వేల మందిని నిర్బంధించారు. సెయింట్​పీటర్స్​ బర్గ్​, మాస్కోలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నావల్నీ మద్దతుదారుల నిర్బంధం

ఇదీ చూడండి:పుతిన్​కు బైడెన్ ఫోన్​- ఆ విషయాలపై ఆందోళన

ABOUT THE AUTHOR

...view details