తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్కరోజే 7.23 లక్షల కరోనా కేసులు- ఆ దేశంలో ఎమర్జెన్సీ

డెల్టా వేరియంట్ల(Delta variant) విజృంభణతో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. వ్యాక్సినేషన్(Corona vaccination)​ ముమ్మరంగా సాగుతున్నా కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 1.5లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. జపాన్​లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్​డౌన్​ సెప్టెంబర్​ చివరి వరకు పొడిగించారు.

Delta variant
ప్రపంచంపై 'డెల్టా' పంజా

By

Published : Aug 20, 2021, 10:43 AM IST

ప్రపంచంపై కరోనా వైరస్​(Corona virus) మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్​ సోకింది. సుమారు 11 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. డెల్టా వేరియంట్లతో(Delta variant) వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పడకలు చాలక ఆసుపత్రుల్లోని ఖాళీ ప్రాంతాల్లో టెంట్లు వేసి చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది.

జపాన్​లో ఎమర్జెన్సీ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ కట్టడి కోసం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది జపాన్​ ప్రభుత్వం. సెప్టెంబర్​ 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 లోపు మూసివేయాలని, షాపింగ్​ మాల్స్​లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని స్పష్టం చేసింది. గత వారంలో సగటున రోజుకు 20 వేల కొత్త కేసులు వచ్చాయి. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీ విస్తరించాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ ఉంటుంది.

సిడ్నీలో లాక్​డౌన్​ పొడిగింపు..

ఆస్ట్రేలియాలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో సిడ్నీ మహానగరంలో లాక్​డౌన్​ పొడిగించారు. సెప్టెంబర్ చివరి వరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. తప్పనిసరిగా మాస్క్​ ధరించటం, కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. గురువారం న్యూ సౌత్​ వేల్స్​లో 642 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు 600లకు పైగా కేసులు వచ్చాయి. డెల్టా వేరియంట్​ తొలి కేసు నమోదైన క్రమంలో జులై 26 నుంచి సిడ్నీలో లాక్​డౌన్​ విధించారు.

దక్షిణ కొరియాలో..

దక్షిణ కొరియాలో వైరస్​ క్రమంగా విజృంభిస్తోంది. కొత్త కేసులు గత రెండు రోజులుగా 2వేలకుపైగా నమోదయ్యాయి. మరోవైపు.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్​డౌన్​ వంటి ఆంక్షలు విధించినప్పటికీ కేసులు పెరగటం గమనార్హం. శుక్రవారం 2,052 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 45 రోజులుగా వెయ్యికిపైగా కేసులు వచ్చాయి. ప్రయాణాలు పెరగటం సహా డెల్టే వేరియంట్​ విజృంభణతోనే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాలు

  • బ్రెజిల్​- బ్రెజిల్​లో కొత్తగా 36 వేల మందికి వైరస్​ సోకింది. వెయ్యి మంది మరణించారు
  • యూకే- యూకేలో 36వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 113 మంది ప్రాణాలు కోల్పోయారు
  • ఇరాన్​- ఇరాన్​లో కొత్తగా 31వేల మందికి పాజిటివ్​గా తేలగా, 564 మంది మృతి చెందారు
  • మెక్సికో- మెక్సికోలో 28 వేల కొత్త కేసులు వచ్చాయి. 940 మంది మరణించారు.

ఇదీ చూడండి:Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'​కు బలి

ABOUT THE AUTHOR

...view details