తెలంగాణ

telangana

ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 50 మందికి పైగా బలి - Myanmar

మయన్మార్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మయన్మార్‌లోని ఓ పచ్చరాయి గనిలో కొండచరియలు విరిగిపడి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కొండచరియలు విరిగిపడి 50 మందికి పైగా బలి

By

Published : Apr 23, 2019, 10:43 PM IST

ఉత్తర మయన్మార్​లోని ఓ పచ్చరాయి గనిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. . మయన్మార్‌కు ఉత్తరాన ఉన్న కచిన్‌రాష్ట్రంలోని ఫాకంట్‌ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడిన గనిలో 54 మంది కార్మికులు చిక్కుకున్నట్లు మయన్మార్‌సమాచార శాఖ తెలిపింది. మృతదేహాలు వెలికితీయడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వాహనాలు, యంత్ర సామగ్రితో సహా కార్మికులు సజీవ సమాధి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడం సాధారణమని స్థానికులు చెబుతున్నారు. 2015, నవంబర్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది మృతి చెందారు. మయన్మార్‌లో ఏటా బిలియన్‌ డాలర్ల పచ్చరాయి ఉత్పత్తి అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details