జపాన్ దిగ్గజ వ్యాపారవేత్త యుసాకు మయిజావా.. గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ విడుదల చేసిన ప్రకటనకు సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ఆకస్మాత్తుగా అప్లికేషన్ ద్వారా గర్ల్‌ఫ్రెండ్ ఎంపికను ఆపేసి ఓ టీవీ కార్యక్రమంలో స్వయంవరానికి సిద్ధమయ్యాడు ఈ కుబేరుడు.
అలా ఆశలు చిగురించాయి..
స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రుడిని చుట్టి రావడానికి ఎంపికైన తొలి ప్రైవేట్ వ్యక్తి యుసాకు మయిజావా. ఈ జపాన్ బిలియనీర్.. తనకో గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చారు. తనతో కలిసి 2023లో స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రయానం చేసేందుకు ఆ 'గర్ల్‌ఫ్రెండ్' సిద్ధంగా ఉండాలని దిగ్గజ వ్యాపారవేత్త స్పష్టం చేశారు.
జపాన్‌కు చెందిన ఓ నటితో విడిపోయినట్టు ఇటీవలే ప్రకటించారు యుసాకు. 44ఏళ్ల వయసులో ఒంటరితనం భరించలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ నెల ఆరంభంలో ప్రకటించారు.
"నాకు ఇప్పుడు 44ఏళ్లు. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు నన్ను వెంటాడుతున్నాయి. వీటిల్లో నేను కూరుకుపోకుండా ఉండాలంటే.. ఒక మహిళను ప్రేమించడం కొనసాగిస్తూ ఉండాలి." అనే ఈ ప్రకటనతో పాటు.. 'చంద్రుడిపై ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు?' అంటూ అప్పట్లో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మరిప్పుడు...