Highest Civilian Award of Bhutan: ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో' ('నాడగ్ పెల్ గి ఖోర్లో'- స్థానిక భాషలో) పేర్కొనే ఈ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్చుక్.. మోదీకి బహుకరించాలని సూచించినట్లు తెలిపింది.
కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ 'ఆర్డర్ ఆఫ్ డ్రక్ గ్యాల్పో' అవార్డును అందిస్తున్నట్లు పేర్కొంది భూటాన్ ప్రధాని మంత్రి కార్యాలయం.
"భూటాన్ ప్రజల తరఫున మోదీకి శుభాకాంక్షలు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆధ్యాత్మిక భావాలు ఉన్న గొప్ప వ్యక్తి మోదీ. ఈ అవార్డు బహుకరణ నేపథ్యంలో మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం."