బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంత్యుత్సవాలు నేడు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ కారణంగా బంగ్లాదేశ్ పర్యటన రద్దు చేసుకున్నట్లు కొన్నిరోజుల క్రితమే మోదీ ప్రకటించారు.
బంగ్లాదేశ్ ఢాకాలోని జాతీయ పరేడ్ మైదానం నేటి నుంచి ప్రారంభమై ఏడాది పొడువున ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఎలాంటి బహిరంగ సభలు లేకుండా జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి కారణంగా బంగ్లా ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. విద్యాసంస్థలను మూసివేసింది. భారత్ సహా విదేశీ పర్యటకులను దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించింది.