థాయిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు కీలక భేటీలకు హాజరు కానున్నారు. తూర్పు ఆసియా కూటమితో పాటు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) సదస్సుల్లో పాల్గొననున్నారు.
సదస్సులతో పాటు పలు దేశాధినేతలతోనూ బ్యాంకాక్‌లో మోదీ భేటీ కానున్నారు. జపాన్ ప్రధాని షింజో ఆబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ జువాన్ ఫుస్తో సమావేశమవుతారు.