జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని భారత్ ఎన్నిసార్లు స్పష్టం చేసినా పాకిస్థాన్ పాలకులు ఈ అంశంపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్... జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి భారత ప్రధాని మోదీ ఘోర తప్పిదం చేశారని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ శాసనసభలో ప్రసగించిన ఆయన.. 370 అధికరణ రద్దు నిర్ణయం కశ్మీర్ స్వాతంత్ర్యానికి దారి తీస్తుందని అన్నారు.
భారత్‌పై మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాక్ ప్రధాని - pm modi latest news
కశ్మీర్‌లో ఆర్టికల్ 370రద్దుపై విషం వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘోర తప్పిదం చేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వక్రబుద్ధిని చాటుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ శాసనసభలో ప్రసంగించారు.
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాక్ ప్రధాని
కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించామని ఇమ్రాన్ తెలిపారు. కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మూడు సార్లు చర్చించానన్నారు. కశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారత్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు పాక్ ప్రధాని.
ఇదీ చూడండి: 'నిర్మలపై వేటు కోసం మోదీ బడ్జెట్ కుట్ర!'
Last Updated : Feb 29, 2020, 7:46 AM IST