Minor Shot Family: పబ్జీ వీడియో గేమ్‌కు బైనిసైన ఓ మైనర్ తన తల్లి సహా ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత వారం జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రక్షణ కోసం తీసుకున్న పిస్టోల్‌తో..
లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన నిందితుడు పబ్జీ ఆటకు బానిసయ్యాడు. దీంతో అతనికి మానసిక సమస్యలు కూడా వచ్చాయి. ఆ వీడియో గేమ్‌ను విపరీతంగా ఆడుతూ చదువుపై శ్రద్ధ చూపట్లేదని అతని తల్లి నహీద్ ముబారక్ (45) మందలించింది. దీంతో నిందితుడు అదే రోజు రాత్రి కప్‌బోర్డులో ఉన్న పిస్టోల్ తీసుకుని తల్లి, సోదరుడు తైముర్ (22) సహా మరో ఇద్దరు తోబుట్టువులను కాల్చిచంపాడు. మరుసటి రోజు ఉదయం ఈ ఘటనపై నిందితుడు పోలీసులకు సమాచారం అందించాడు.