తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం - లలాజర్​ కాలనీలో అత్యాచారం

పాకిస్థాన్​లోని లాహోర్​లో ఏడేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉందని డాక్టర్లు వెల్లడించారు.

rape in pakisthan
పాక్​లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Nov 22, 2020, 6:11 PM IST

ఏడేళ్ల బాలికను ఓ దుకాణదారుడు అత్యాచారం చేసిన దారుణమైన ఘటన పాకిస్థాన్​ లాహోర్​లోని నవాబ్​ టౌన్​ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

తినుబండారాలకోసం వెళ్లి...

లలాజర్​ కాలనీలోని ఓ దుకాణంలో తినుబండారాలు కొనుక్కుందామని వెళ్లిన ఏడేళ్ల బాలికను అత్యాచారం చేశాడు దుకాణదారుడు. కొద్దిసేపటి తర్వాత తన కూతురును వెతుక్కుంటూ వచ్చిన బాధితురాలి తండ్రికి... ఆ ఏడేళ్ల బాలిక ప్రాణపాయ స్థితిలో కనిపించింది. వెంటనే తనను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు బాధితురాలి తండ్రి. డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'

ABOUT THE AUTHOR

...view details