అఫ్గానిస్థాన్ తఖార్ ప్రావిన్స్‌లో జరిగిన తాలిబన్ల దాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. శనివారం ఉదయం స్థానికంగా ఉండే సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. హవా షినాసి ప్రాంతంలో ఉన్న ఆర్మీ చెక్‌పోస్టులోకి తాలిబన్లు చొరబడేందుకు యత్నించగా.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రదాడి- ఐదుగురు మృతి - taliban news
అఫ్గానిస్థాన్ తఖార్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉగ్రదాడి-అయిదుగురు మృతి
ఈ పోరులో తాలిబన్ సభ్యులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై ఏ ఉగ్ర సంస్థ స్పందించలేదు.