తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్‌ సైనిక వాహనాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి - pak army vs militants

పాకిస్థాన్‌ భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రమూక తెగబడింది. ఆ దేశ సైనిక వాహనాలపై బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు సహా 15 మంది మృతి చెందారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం సైనికాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Militants ambush on pakisthan army vehicles 15 people died
పాకిస్థాన్‌ సైనిక వాహనాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి

By

Published : Oct 16, 2020, 8:16 AM IST

పాకిస్థాన్‌కు చెందిన చమురు, సహజవాయువు అభివృద్ధి సంస్థ కార్మికులకు రక్షణగా వెళ్తున్న సైనిక వాహనాలపై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడ్డారు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దు వెంబడి ఉత్తర వజిరిస్థాన్‌ జిల్లా రజ్మక్‌ వద్ద అత్యాధునిక విస్ఫోటక పరికరం సహాయంతో సైనిక వాహన శ్రేణిపై బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో కెప్టెన్‌ సహా ఏడుగురు సైనికులు, చమురు, సహజవాయువు సంస్థకు చెందిన 8 మంది మృతి చెందారు.

'అప్పటి వారే..'

దాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర వజిరిస్థాన్‌ జిల్లా గతంలో మిలిటెంట్లకు ప్రధాన కేంద్రంగా ఉండేది. భద్రతా బలగాలు పలుమార్లు సైనిక చర్యలు చేపట్టి వారిని నియంత్రించారు. అప్పుడు తప్పించుకున్న కొందరు ఉగ్రవాదులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నట్లు పాక్‌ సైన్యం భావిస్తోంది.

ఇదీ చూడండి:భారత్‌తో సత్సంబంధాల దిశగా నేపాల్‌ ముందడుగు!

ABOUT THE AUTHOR

...view details