రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా ప్రాంతంలోని కురిల్ సరస్సులో 16 మంది ప్రయణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ మేరకు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంఐ-8 హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది సహా 13 పర్యటకులు ఉన్నట్లు పేర్కొంది.
రష్యాలో ఘోరప్రమాదం- 16 మందితో కూలిన హెలికాప్టర్ - Helicopter crash
రష్యాలో 16 మంది పర్యటకులతో ప్రయణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ మేరకు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.
హెలికాప్టర్ ప్రమాదం
"ఆగష్టు 12, 2021న 00:50 (స్థానిక కాలమానం ప్రకారం) , క్రోనోటిస్కై నేచర్ రిజర్వ్‌లోని కురిల్ సరస్సులో ఎంఐ-8 హెలికాప్టర్ కూలినట్లు సమాచారం అందింది. విమానంలో ముగ్గురు సిబ్బంది, 13 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:ఫిలిప్పీన్స్‌లో భూకంపం- సునామీ హెచ్చరిక