తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: మెక్సికోలో 60 వేలకు చేరువలో మరణాలు

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఇప్పటికే 8 లక్షల మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య రెండు కోట్ల 31 లక్షలకు చేరింది.

China reports 22 imported COVID-19 cases: officials
కరోనా పంజా: మెక్సికోలో 60 వేలకు చేరువలో మరణాలు

By

Published : Aug 22, 2020, 6:43 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 8 లక్షలు దాటిపోయింది.

మొత్తం కేసులు 2,31,49,739

యాక్టివ్ కేసులు66,13,413

మరణాలు8,03,807

  • అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 58 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య లక్షా 80 వేలకు సమీపించింది.
  • బ్రెజిల్​లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం 35 లక్షల 36 వేల మంది ప్రజలు మహమ్మారి బారినపడ్డారు. మృతుల సంఖ్య1,13,454కు పెరిగింది.
  • రష్యాలో మరో 4,921 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.51 లక్షలకు చేరింది. 121 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 16,310కి ఎగబాకింది.

మెక్సికో

మెక్సికోలో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆ దేశంలో మరణాల సంఖ్య రోజుకో గరిష్ఠానికి చేరుతోంది. తాజాగా 504 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 60 వేలకు చేరువైంది. కొత్తగా 5,928 కేసులను గుర్తించారు అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5.49 లక్షలకు పెరిగింది.

విదేశీయుల కేసులే

చైనాలో స్థానిక వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశంలో కొత్త కేసులు ఉద్భవించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు.

హంకాంగ్ విలవిల

చైనా అధీనంలోని హాంకాంగ్​ కరోనాతో విలవిల్లాడుతోంది. జులైలో తిరిగి ప్రారంభమైన కరోనా వ్యాప్తి.. క్రమంగా తీవ్రమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,632కి చేరగా, మరణాల సంఖ్య 75కు పెరిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో స్థానికులకు ఉచితంగానే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

సింగపూర్

సింగపూర్​లో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య శాఖ వెల్లడించింది. ఇందులో ఐదుగురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. మరో ఇద్దరు సింగపూర్ వాసులు ఉన్నట్లు తెలిపింది. మిగిలిన 43 మంది సింగపూర్​లోని విదేశీ కార్మికులేనని స్పష్టం చేసింది. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 56,266కు పెరిగినట్లు ప్రకటనలో తెలిపింది.

సెప్టెంబర్ నుంచి బ్రూనై, న్యూజిలాండ్ దేశాలకు చెందిన ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి నిబంధనను సడలిస్తున్నట్లు సింగపూర్ వైద్య శాఖ శుక్రవారం తెలిపింది. క్వారంటైన్​కు బదులుగా వీరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి.. ఫలితం నెగెటివ్ వచ్చిన వారికి దేశంలో కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

పాక్

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 92 వేలకు చేరింది. 586 మందికి తాజాగా పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించినట్లు పాకిస్థాన్ వైద్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మరణాల సంఖ్య 6,231కి పెరిగినట్లు వెల్లడించింది. పాక్​లోని సింధ్, పంజాబ్​లో వైరస్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు

దేశం కేసులు మృతులు
అమెరికా 57,98,983 1,79,240
బ్రెజిల్​ 35,36,488 1,13,454
రష్యా 9,51,897 16,310
దక్షిణాఫ్రికా 6,03,338 12,843
పెరూ 5,76,067 27,245
మెక్సికో 5,49,734 59,610
కొలంబియా 5,22,138 16,568

ABOUT THE AUTHOR

...view details