తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా మరణాల్లో మూడో స్థానానికి చేరిన మెక్సికో - covid-19 pandemic news

వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న మెక్సికో దేశం కరోనా మరణాల్లో మూడో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటి 78 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 6 లక్షల 84 వేలకు పైనే ఉంది.

Mexico 3rd in global pandemic deaths, Vietnam struggles anew
కరోనా మరణాల్లో మూడో స్థానానికి చేరిన మెక్సికో

By

Published : Aug 1, 2020, 8:19 PM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. పలు దేశాల్లో వైరస్​ రెండోసారి విజృంభిస్తుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. కొవిడ్ కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన దేశాల జాబితాలో మెక్సికో మూడో స్థానానికి చేరింది. కొత్తగా మరణించిన 688 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 46,688కి పెరిగింది. అమెరికా, బ్రెజిల్​ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 78లక్షల 22వేల 102మందికి వైరస్ సోకింది. 6లక్షల 84వేల 137మంది మరణించారు. కోటి 12లక్షల 14వేల 474మంది కోలుకున్నారు.

టోక్యోలో వరుసగా రికార్డు..

జపాన్​ రాజధాని టోక్యోలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో కొత్తగా 472 మంది వైరస్ బారినపడ్డారు. జపాన్​లో మొత్తం కేసుల సంఖ్య 36 వేల 324కి చేరగా.. ఇప్పటివరకు 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్​లో

సింగపూర్​లో కొత్తగా 307 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు భారత్​ నుంచి వెళ్లిన వారున్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా విదేశాలకు చెందిన కార్మికులు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 52,512కి చేరింది. 27 మంది చనిపోయారు.

వియాత్నంలో 99 రోజుల తర్వాత కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్తగా మరో వ్యక్తి వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: చైనా టీకాలు కొనొద్దు, రష్యానూ నమ్మొద్దు!

ABOUT THE AUTHOR

...view details