తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ అలా స్పందిస్తారని ఊహించలేదు: ఇమ్రాన్​ - imran latest news

పాక్​ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను చేసిన శాంతి ప్రతిపాదనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సానుకూల స్పందన రాలేదని చెప్పారు ఇమ్రాన్​ ఖాన్. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఓ మేగజిన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

imran
మోదీ అలా స్పందిస్తారని ఊహించలేదు: ఇమ్రాన్​

By

Published : Jan 24, 2020, 1:01 PM IST

Updated : Feb 18, 2020, 5:36 AM IST

భారత్​పై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తాజాగా మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు తాను చేసిన ప్రతిపాదనకు భారత ప్రధాని అప్పట్లో సానుకూలంగా స్పందించలేదని చెప్పుకొచ్చారు. దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా 'ఫారెన్ పాలసీ మేగజిన్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.

గతేడాది ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్​ పుల్వామా ఘటన అనంతరం మోదీతో సంప్రదింపులు జరిపానని ఇమ్రాన్ అన్నారు. ఈ దాడిలో పాకిస్థాన్​కు సంబంధించిన వారి పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీకి చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఘటన అనంతరం భారత్...​ పాక్​పై దాడికి పాల్పడిందన్నారు.

సైన్యం చర్యలతో రెండు దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కావన్నారు ఇమ్రాన్​. శాంతి చర్చలతోనే సాధ్యమన్నారు. ప్రపంచంలో ఆసియాలోనే పేదలు అధికంగా ఉన్నారని.. దీనిని నిర్మూలించేందుకు భారత్​-పాక్ సంయుక్తంగా కృషి చేయాలన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు

Last Updated : Feb 18, 2020, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details