తెలంగాణ

telangana

ETV Bharat / international

యవ్వనపు తొలిదశలోనే మానసిక చికిత్స మేలు

Mental illness adults: యవ్వనపు తొలిదశలో మానసిక సమస్యలు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలోనే సరైన వైద్యం చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే సమస్యలు జీవితాంతం వెంటాడే ప్రమాదం ఉందని అంటున్నారు.

Mental illness adults
Mental illness adults

By

Published : Dec 16, 2021, 8:44 AM IST

Mental illness adults: మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది... యవ్వనపు తొలిదశ! చదువు కొలిక్కివచ్చి, స్వతంత్రంగా ఆలోచించడానికి, వృత్తి జీవితాన్ని ఆరంభించడానికి, కొత్త బంధాలను ఏర్పరచుకోవడానికి, దీర్షకాల అలవాట్లను అభివృద్ధి చేసుకోవడానికి బాటలు పరిచేది ఈ వయసే. అయితే, చాలామందిలో మానసిక అనారోగ్యం బయటపడేది కూడా సరిగ్గా ఇదే వయసు. అ సమయంలో సరైన వైద్యం, కౌన్సెలింగ్‌ తీసుకోకపోతే, ఆ సమస్య జీవితాంతం వెంటాడే ప్రమాదముందని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

Psychological Healthcare adults

Mental illness medication

ఇందుకు సంబంధించి మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోనీ జిమ్‌, స్లిండర్స్‌ వర్సిటీ నిపుణుడు స్టేఫెన్‌ అలిసన్‌లు తమ అధ్యయన వివరాలను పంచుకున్నారు.

'యవ్వనపు తొలిదశ ఎంతో కీలకమైనది. ఈ సమయంలో వెలుగుచూసే మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స తీసుకోవాలి. తద్వారా భవిష్యత్తు ఒడుదొడుకులకు గురికాకుండా కాపాడుకోవచ్చు. కొందరు చికిత్స ప్రారంభించి, మధ్యలోనే మానేస్తారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుంది. భవిష్యత్తలో దీర్ఘకాల సమస్య తప్పకపోవచ్చు. ఆస్టేలియాలోని హెడ్‌స్పేస్‌ సర్వీస్‌ కేంద్రాల్లో చికిత్స పొందేవారిలో ఇలాంటి వారు చాలామంది ఉంటున్నారు. దీర్షకాల చికిత్సతోనే మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక అనారోగ్యంతో బాధపడేవారు సంపూర్ణంగా స్వస్థత పొందేవరకూ వారికి తోడుగా ఉండాలి. ఇందుకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు అవసరం" అని జిమ్‌, స్టీఫెన్‌లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వ్యాయామంతో పిల్లలకు ఎన్ని లాభాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details