2019లో శ్రీలంకలో ఈస్టర్ వేడుకల రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన ప్రధాన సూత్రధారుడిని గుర్తించినట్లు శ్రీలంక హోంమంత్రి శరత్ వీరశేఖర తెలిపారు. నౌఫెర్ మౌలావి ఈ బాంబు దాడి ఘటనకు ప్రధాన కుట్రదారు అని శరత్ మీడియా సమవేశంలో వెల్లడించారు.
హజ్జుల్ అక్బర్ అనే వ్యక్తి నౌఫెర్కు సహకరించాడని శరత్ తెలిపారు. వీరు స్థానిక ఇస్లామిక్ ఉగ్ర సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు. మారణకాండకు సంబంధించి 32 మంది నేరస్థులకు ఇప్పటికే శిక్ష విధించినట్లు వెల్లడించారు. 75 మందిని నిర్బంధించినట్లు పేర్కొన్నారు.