తాలిబన్లపై పోరు కోసం.. భారత్ తమకు మద్దతు ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి పంజ్‌షేర్‌లోని(panjshir news) తిరుగుబాటు దళాలు. వియాన్(డబ్ల్యూఐఓఎన్) అనే వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్(Massoud Afghan) మేనకోడలు అమీనా జియా మసూద్(Amina Zia Massoud) స్వయంగా ఈ విషయం చెప్పడం విశేషం.
అఫ్గాన్ ప్రముఖ కార్యకర్త, రచయిత అయిన అమీనా.. ఏళ్లుగా భారత్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తమకు కచ్చితంగా మద్దతు ఇచ్చే దేశాల్లో భారత్ ఒకటని ఆమె అభిప్రాయపడ్డారు.
తాలిబన్ల పాలనపై భారత నమ్మకం ఉంచదని తనకు తెలుసని వ్యాఖ్యానించారు మసూద్ (Ahmed Masood panjshir). అందుకే.. భారత్ తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించదని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
''తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. మా కుటుంబం కాబుల్‌లోనే ఉంది. మేం వెంటనే మొదటి ఫ్లైట్‌లోనే దిల్లీకి వెళ్లిపోయాం. అలా నా బాల్యం రెండేళ్లు అక్కడే గడిచిపోయింది. భారత్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. భారత్ తమ బాధ్యతగా.. రెసిస్టెన్స్ దళాలకు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటున్నా.''
- అమీనా జియా మసూద్, అఫ్గాన్ కార్యకర్త, రచయిత
పంజ్‌షేర్‌ను(panjshir news) తాలిబన్లు ఆక్రమించుకున్నట్లు ఎన్నో నకిలీ వార్తలొచ్చాయని, ఇవి తమ పోరాటంపై ప్రభావం చూపాయని మసూద్ తెలిపారు. తాలిబన్లపై తిరుగుబాటు (panjshir taliban) కొనసాగుతుందని అన్నారు.
''సమాచార వ్యవస్థను స్తంభింపచేశారు. ఇంటర్నెట్ ఆగిపోయింది. ఈ సమయంలో ఎన్నో నకిలీ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ.. మీకు చెప్పేది ఒకటే. తిరుగుబాటు ఇంకా కొనసాగుతోంది. పంజ్‌షేర్‌ను ఆక్రమించుకోవడం చాలా క్లిష్టతరం. శక్తిమంతమైనది మాత్రమే కాకుండా.. భౌగోళికంగానూ పంజ్‌షేర్ చాలా పెద్దదని తాలిబన్లకు అర్థమైందనుకుంటా.''
- అమీనా జియా మసూద్, అఫ్గాన్ కార్యకర్త, రచయిత
అఫ్గానిస్థాన్ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi Afghanistan) శుక్రవారం.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పేరును ఎక్కడా ప్రస్తావించని మోదీ.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ అఫ్గాన్.. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్కడి నూతన ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆచితూచి అడుగులు వేయాలని, విస్తృత చర్చల అనంతరమే ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేశారు. షాంఘై శిఖరాగ్ర సదస్సుకు వర్చువల్‌గా హాజరైన మోదీ (Narendra Modi Afghanistan).. అఫ్గాన్‌లో ప్రభుత్వ మార్పు అందరి ఆమోదంతో జరగలేదని అన్నారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎందరో నిరాశ్రయులయ్యారు..