తెలంగాణ

telangana

ETV Bharat / international

2 దేశాల సరిహద్దుల్లోని నది నెత్తుటిమయం.. ఎందుకు? - ఆఫ్రికన్​ స్వైన్ ఫీవర్ బారిన పడిన 3 లక్షల 80వేల పందుల్ని వధించింది దక్షిణ కొరియా

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి దేశాల సరిహద్దుల్లోని నది... నెత్తుటిమయం అయింది. స్వచ్ఛమైన నీటికి బదులుగా రక్తం ప్రవహించడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఎందుకలా జరిగింది?

2 దేశాల సరిహద్దుల్లోని నది నెత్తుటిమయం.. ఎందుకు?

By

Published : Nov 13, 2019, 2:24 PM IST

ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​... పందుల్లో వ్యాపించే జ్వరం. ఈ వ్యాధి ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ జ్వరంతో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. ఇబ్బంది అంతా పందులకే. ఒక్కసారి వచ్చిందంటే ఆ పంది చనిపోవడం ఖాయం. ఆ వ్యాధి ఇతర పందులకూ వ్యాపిస్తుంది. వాటికీ మరణమే గతి.

ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​కు సంబంధించి సెప్టెంబర్​లో తొలి కేసు నమోదైంది. వెంటనే దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంటువ్యాధి వ్యాపించకుండా చూసేందుకు పందుల్ని చంపడమే ఉత్తమ మార్గమని నిర్ణయించింది.

ఇప్పటివరకు ఆఫ్రికన్​ స్వైన్ ఫీవర్ బారిన పడిన 3 లక్షల 80వేల పందుల్ని వధించింది దక్షిణ కొరియా. ఇటీవల 47 వేల వరాహాల మృతదేహాలను సియోల్​కు సమీపంలోని కొరియా సరిహద్దుల్లో పడేసింది. అయితే గతవారం భారీ వర్షం కురవగా... పందుల రక్తం సమీపంలోని ఇమ్​జిన్​ నదిలోకి ప్రవహించింది.

"నది ఎర్రగా మారడాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నీటి నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని పీల్చడం కష్టంగా ఉంది. నది సమీపంలో పని చేయలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు."

-లీ సియోక్ ఊ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి

నెత్తుటిమయం అయిన నదిని శుభ్రపరిచేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. తాగు నీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి : మొండి బకాయిలకు కారణం 'కొత్త కుర్రోళ్లే'..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details