తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రవాది మసూద్​​పై చర్యలకు ఈయూలో జర్మనీ ప్రతిపాదన - Europian Union

ఐరోపా సమాఖ్యలో జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​కు వ్యతిరేకంగా జర్మనీ ప్రతిపాదన తెచ్చింది. పాకిస్థాన్​ ఉగ్రసంస్థ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని కోరింది.

మసూద్ అజార్​​

By

Published : Mar 20, 2019, 2:16 PM IST

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఈయూ(ఐరోపా సమాఖ్య)ను ఆశ్రయించింది జర్మనీ. ఈ సమాఖ్యలోని 28 దేశాలు తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది.

ఇప్పటికే ఈయూలోని పలు దేశాలు జర్మనీకి మద్దతుగా నిలిచాయి. కానీ ఈ అంశంపై ఐరోపా సమాఖ్య ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా తిరస్కరించిన కొద్ది రోజులకే... ఈయూలో జర్మనీ ఈ ప్రతిపాదనను తేవటం విశేషం.

28 దేశాల్లో మసూద్​కు నో ఎంట్రీ

ఈ మేరకు ఈయూ నిర్ణయం తీసుకుంటే... 28 దేశాల్లో​ అడుగుపెట్టేందుకు మసూద్​కు దారులు మూసుకుపోతాయి. అజార్​ ఆస్తులను ఆయా దేశాలు జప్తు చేస్తాయి.

ఐక్యరాజ్య సమితిలో చైనా అడ్డుకట్ట

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మార్చి 15న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) లో ఫ్రాన్స్​ ప్రతిపాదించింది.

ABOUT THE AUTHOR

...view details