తెలంగాణ

telangana

ETV Bharat / international

చికిత్స నిమిత్తం లండన్​కు నవాజ్​ షరీఫ్​!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ మెరుగైన చికిత్స కోసం లండన్​ వెళ్లనున్నారు. ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తున్నందున వైద్యుల సలహా మేరకు లండన్​కు వెళ్లడానికి పాక్​ ప్రభుత్వం అనుమతించింది. విదేశాలకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఎగ్జిట్​ కంట్రోల్​ జాబితా నుంచి ఆయన పేరును తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది.

Maryam says ailing Sharif to fly to UK for treatment; govt gives nod

By

Published : Nov 9, 2019, 6:46 AM IST

Updated : Nov 9, 2019, 7:41 AM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం లండన్​కు వెళ్లనున్నారు. షరీఫ్​ లండన్​ వెళ్లేందుకు అనుమతించాలని ఆయన కుటుంబం చేసిన అభ్యర్థనకు పాకిస్థాన్ ప్రభుత్వం​ ఆమోదం తెలిపింది.

రక్తంలో ప్లేట్​లెట్ల సంఖ్య భారీగా తగ్గడం వల్ల నవాజ్ షరీఫ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్లేట్​లెట్ల సంఖ్య 2 వేలకు పడిపోవడం వల్ల అక్టోబర్​ 22న ఆయనను కస్టడీ నుంచి ఆస్పత్రికి తరలించింది పాక్​ యాంటీ గ్రాఫ్ట్ బాడీ. రెండు వారాల చికిత్స అనంతరం తిరిగి ఆయన నివాసానికి తరలించింది.

విదేశీ ప్రయాణాలపై నిషేధిత జాబితా అయిన ఎగ్జిట్​ కంట్రోల్​ లిస్ట్​(ఈసీఎల్​)లో షరిఫ్​తో పాటు ఆయన కుమార్తె మరియం పేరు ఉంది. ఈ జాబితాలో తన పేరు ఉన్నందున తండ్రితో కలిసి లండన్​ వెళ్లేందుకు వీలుకాదని తెలిపారు మరియం​. తన తండ్రి పేరును జాబితా​ నుంచి తొలగిస్తే ఈ వారంలో లండన్​కు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

చికిత్సకు అభ్యంతరం లేదు

చికిత్స కోసం షరీఫ్​ విదేశాలకు వెళ్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ దేశ ప్రధాని ప్రత్యేక సహాయకుడు నయీముల్ హక్​ తెలిపారు. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షరీఫ్​ పేరును ఎగ్జిట్ కంట్రోల్​ జాబితా​ నుంచి తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Last Updated : Nov 9, 2019, 7:41 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details