జైల్లో తనకు ఎలుకలు పడ్డ కలుషిత ఆహారాన్ని అందించారని.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్. జర్నలిస్టులతో జరిగిన అనధికారిక సమావేశంలో ఆమె ఈ విషయాలను బయటపెట్టారని తెలుస్తోంది. ఆ సమాచారం ప్రకారం.. జైల్లో తనకిచ్చిన ఔషధాలు సైతం నాసిరకమని ఆరోపించారు. జైలు గదిలో, బాత్రూంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొందన్నారు.
"నేను ఇప్పటికి రెండు సార్లు జైలుకు వెళ్లాను. ఒక మహిళతో జైల్లో ఎలా వ్యవహరించారో చెప్తే ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకుంటుంది."