తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రియుడి పెళ్లిని పెటాకులు చేసిన ప్రేయసి!

చైనాలో ఓ వివాహంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లి.. వివాహం చేసుకోమని బలవంతం చేసింది. వరుడు ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. ఈ లోపు పెళ్లి కూతురు అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

By

Published : Apr 10, 2019, 2:49 PM IST

చైనా పెళ్లి

వివాహ తంతు దాదాపు పూర్తయ్యే సమయంలో ఆపండి.. అంటూ ఎవరో ఒకరు పెళ్లి పెటాకులు చేసే సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చాలా సార్లు చూసుంటాం! ఇదే తరహాలో చైనాలో ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లి.. వివాహం చేసుకోమని బలవంతం చేసింది. పాపం అయోమయ పరిస్థితిలో పడిన పెళ్లికొడుకు ఆమెను వదిలించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. ఈ లోపు పెళ్లి కూతురు అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయింది. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రేయసికి వ్యతిరేకంగా.. వధువుకు సానుభూతిగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ABOUT THE AUTHOR

...view details