తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2020, 11:51 PM IST

Updated : Feb 29, 2020, 5:03 PM IST

ETV Bharat / international

'తైపూసం' ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలు అధికంగా ఉన్నచోట జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. మలేసియా 'తైపూసం' ఉత్సవాల్లో అవేవీ కనిపించలేదు. ఇప్పటివరకు ఆ దేశంలో 15మందికి వైరస్​ సోకగా.. ఆ ప్రభావం ఎక్కడా కనిపించకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

MANY IGNORE MASK ADVICE AT MALAYSIA HINDU FESTIVAL
తైపూసం ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం

మలేసియాలో జరిగిన 'తైపూసం హిందూ వార్షికోత్సవాల'కు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ దేశంలో ఇప్పటి వరకు 15మందికి సోకగా.. ఆ ప్రభావం ఉత్సవాలపై ఏ మాత్రం కనిపించలేదు. శిలంగూర్​ రాష్ట్రం సున్నపురాతి కొండమీద బటు గుహల ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు వేలసంఖ్యలో మలేసియన్​ హిందువులు హాజరయ్యారు.

272 మెట్లెక్కి ఆలయంలోకి...

ఈ ఉత్సవాలకు సుమారుగా పదిహేను లక్షల మంది హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేసింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి వారి అంచనాలు మరింత పెరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 272 మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ కమిటీ చర్యలు భేష్​

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో... ఈ ప్రసిద్ధ తీర్థయాత్రలో ముందు జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రత్యేక మాస్క్​లు ధరించాలని సందర్శకులకు సూచించారు.

"ఆలయ నిర్వాహకులు భక్తుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయం. కరోనా వైరస్​ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్​లను అందిస్తున్నారు. అత్యవసర వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు."
- నోర్జాటి ఐజత్​, పర్యటకురాలు

భక్త జనసంద్రంలో తైపూసం హిందూ వార్షికోత్సవాలు

ఇదీ చదవండి: యూఏఈలో భారతీయుడి 'ఫిట్​నెస్​ పరుగు'

Last Updated : Feb 29, 2020, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details