తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవు' - undefined

ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్ ప్రిపేర్డ్​నెస్ మానిటరింగ్​ బోర్డ్​ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరింది.

many-countries-unprepared-for-china-virus-monitor
'కరోనాను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవు'

By

Published : Jan 31, 2020, 11:08 AM IST

Updated : Feb 28, 2020, 3:31 PM IST

చైనాను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో... ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని స్వతంత్ర విభాగం​ గ్లోబల్​ ప్రిపేర్డ్​నెస్​ మానిటరింగ్​ బోర్డ్ (జీపీఎంబీ)​. చాలా దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవని తెలిపింది. తక్షణమే ముందుస్తు చర్యలు చేపట్టాలని హెచ్చరించింది.

చైనా సహా కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొన్ని దేశాలు చేపట్టిన వ్యాధి నియంత్రణ చర్యలను కొనియాడింది జీపీఎంబీ.

"కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ.. ప్రపంచ దేశాలు తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టి ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధికి అత్యంత ఖర్చుతో కూడకున్న వైద్యం అవసరం. వ్యాక్సిన్​ను కనుగొనేందుకు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థలను కోరుతున్నాం. పేద దేశాలకు ఆర్థిక సాయం చేసేందుకు విరాళాలు అందించాలని ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు, ప్రాంతీయ బ్యాంకులను విన్నవిస్తున్నాం. "
-జీపీఎంబీ

చైనాలో కరోనా వైరస్​ వల్ల 213 మంది మరణించిన నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఈ జీపీఎంబీ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Feb 28, 2020, 3:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details