రైలులో 10మందిని కత్తితో పొడిచిన దుండగుడు - జపాన్ కత్తి దాడి వార్తలు
18:35 October 31
రైలులో 10మందిని కత్తితో పొడిచిన దుండగుడు
జపాన్ రాజధాని టోక్యోలో ఓ దుండగుడు రైలులో 10 మంది ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు(japan knife attack). అనంతరం రైలు బోగీకి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జపాన్ మీడియా వెల్లడించింది.
టోక్యో చోఫులోని ది కియో లినియా కొకుర్యో రైల్వే స్టేషన్లో ఈ ఘటన(japan train stabbing) జరిగింది. ఆగంతుకుడు ఒక్కసారిగా విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వారు రైలు కిటికీల ద్వారా బయటకు పారిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి(japan train news) చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు(japan knife attack train ). అతడిని 20ఏళ్ల యువకుడిగా గుర్తించారు. అయితే అతడు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది(japan train stabbing incident).
మూడు నెలల వ్యవధిలో టోక్యోలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఆగస్టోలో టోక్యో ఒలింపిక్స్ ముగింపు ముందు రోజు రైలులో ఓ దుండగుడు 10మందిని కత్తితో(japan knife attack 2021) పొడిచాడు.