తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ ఒక్కరాత్రి ఉండలేక.. బెడ్​షీట్లతో పరార్​! - క్వారంటైన్ నుంచి తప్పించుకున్న వ్యక్తి

అనుమతి లేకుండా ఆ రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తిని తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు అధికారులు. ఆ రాత్రికి ఓ క్వారంటైన్​ హోటల్​లో బస కల్పించారు. అయితే అందులోని బెడ్​షీట్లను తాడుగా కట్టి.. నాలుగో అంతస్తు నుంచి దిగి పారిపోయాడా వ్యక్తి. ఇంతకీ ఎక్కడంటే?

escapes quarantine
క్వారంటైన్

By

Published : Jul 22, 2021, 10:42 AM IST

ఆస్ట్రేలియాలోని.. పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రానికి అనుమతి లేకుండా వచ్చిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా వస్తేనే అరెస్టు చేస్తారా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తిరిగి వెళ్లిపొమ్మని ఆదేశాలిచ్చి, ఆ రాత్రి వరకు బస కల్పిస్తే.. అక్కడి నుంచి తప్పించుకున్నాడా మహానుభావుడు.

హోటల్

ఏం జరిగిందంటే?

క్వీన్స్​లాండ్​లోని బ్రిస్బేన్​ నుంచి వెస్ట్రన్​ ఆస్ట్రేలియాకు సదరు వ్యక్తి సోమవారం సాయంత్రం వచ్చాడు. అయితే ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన జీ2జీ అనుమతులను అతడు పొందలేకపోయాడు. దీంతో 48 గంటల్లో క్వీన్స్​లాండ్​ తిరిగి వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారు అధికారులు. ఆ రాత్రి ఉండటానికి అతడిని ఓ క్వారంటైన్​ హోటల్​కు పంపించారు.

ఉన్నవాడు తిన్నగా ఉండక, హోటల్​ గదిలోని దుప్పట్లను తాడుగా కట్టి.. నాలుగో అంతస్తు నుంచి దిగి పారిపోయాడు. మంగళవారం ఉదయం 12.45 గంటల ప్రాంతంలో అతడు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 8.55 గంటలకు అతడిని మౌంట్ లావ్లీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

హోటల్ పార్కింగ్ ప్రాంగణం

ఇదీ చూడండి:మర్మాంగాన్ని కొరికిన కొండచిలువ- బాత్​రూంలో ఉండగా..

ABOUT THE AUTHOR

...view details