అది ఓ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫూటేజ్. చైనాకు చెందిన స్థానిక మీడియా గత నెల 26న ఆ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది. అది అప్‌లోడైన కొన్ని నిమిషాలకే వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. వీడియోలోని డెలివరీ బాయ్‌ను భేష్ అని మెచ్చుకుంటున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకుని ఉన్న కుక్కను కాపాడటమే అందుకు కారణం.
డోర్లు తెరుచుకుని ఉన్న లిఫ్ట్‌లోకి ఓ పెంపుడు కుక్క వెళ్లింది. ఈ క్రమంలో ఆ శునకం మెడకు ఉన్న బెల్ట్ లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో లిఫ్ట్ కిందకి వెళ్లడం వల్ల ఆ బెల్ట్ కుక్క మెడకు బిగుసుకుపోయింది. కింద ఫ్లోర్‌లోనే లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న డెలివరీ ఏజెంట్‌కు.. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే మెడకు బెల్ట్ బిగుసుకుపోయి విలవిల్లాడుతున్న కుక్క కనిపించింది. వెంటనే బెల్ట్‌ను తీసేసి డెలివరీ బాయ్ దాని ప్రాణాలు కాపాడాడు.