జస్ట్ కొన్ని వెంట్రుకలు కట్(హెయిర్ కట్) చేసినందుకు ఏకంగా 500 డాలర్లు టిప్ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ హెయిర్ డ్రస్సర్.. తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. టిప్ ఇచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుని, అతడితో సెల్ఫీ దిగింది.
ఇంతకీ ఏమైంది?
యూట్యూబర్ స్టీవెన్ సచ్పీరో.. పలు వీడియోలతో నెటిజన్లను అలరిస్తున్నాడు. ఈ మధ్య పలు సెలూన్స్‌కు వెళ్లి, హెయిర్ డ్రస్సర్స్కు ఊహించనంత టిప్ ఇచ్చి, వారిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు.
అలానే ఓ సెలూన్‌కు వెళ్లిన స్టీవెన్.. కేవలం కొన్ని వెంట్రుకలు మాత్రమే కట్ చేయించుకుని, ఇక ఆపేయమని సదరు మహిళా హెయిర్ డ్రస్సర్కు చెప్పాడు. డబ్బులు వద్దులే అని ఆమె చెప్పింది. అయినా సరే 500 డాలర్లను(భారత కరెన్సీ ప్రకారం రూ.37 వేలు) టిప్‌గా ఇచ్చాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఆ హెయిర్ డ్రస్సర్.. తన ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.
అయితే ఈ డబ్బు తన ఇంటి అద్దె సమస్యను తీర్చేసిందని ఆ మహిళ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి, సోషల్ మీడియా యూజర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు వ్యూస్, లైక్స్‌తో దూసుకెళ్తోంది.