దోమ ఉండటానికి చాలా చిన్నగానే ఉన్నా.. వాటి సామర్థ్యం అమోఘం. మనం వదిలే గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ ఆధారంగా పదుల మీటర్ల దూరంలోనే అది మనల్ని పసిగడుతుంది. కొద్దిసేపట్లోనే మన వద్దకు వచ్చేసి, చర్మంపై వాలుతుంది. సూదిలాంటి ముక్కుతో కాటు వేసి, రక్తాన్ని జర్రుకుంటుంది. ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. అందువల్లే అవి డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. మగ దోమలు (Male Mosquitoes news) పూలలోని మకరందంపై ఆధారపడి జీవిస్తాయన్నది ఇప్పటివరకూ రూఢీ అయిన విషయం. (Male Mosquito food)
రక్తం తాగకపోయినా మగదోమలు కూడా మనుషుల జోలికి వస్తున్నట్లు మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో (Mosquito Melbourne 2021) వెల్లడైంది. అవి మనకు దూరంగా ఉంటాయన్నది అపోహ మాత్రమేనని వారు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. వీరు డెంగీని వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై జాతిలోని మగ దోమలను ఎంచుకున్నారు. నిర్దిష్ట ప్రాంతంలో వాటిని వదిలారు. అక్కడ కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టారు. దోమల కదలికలను కెమెరాల ద్వారా గమనించారు. ఈ వీడియోలను విశ్లేషించినప్పుడు.. మగ దోమలు కూడా మానవుల పట్ల ఆకర్షణకు గురవుతాయని వెల్లడైంది.
కొందరిపై ఎక్కువ ఆకర్షణ..