బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తుపాకీ తూటాలను సైతం లెక్కచేయలేదు పాక్ యువతి మలాలా యూసఫ్జయ్. శరీరంలో తూటా దిగినా పట్టువిడవలేదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచం గౌరవించే స్థాయికి ఎదిగి.. పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి సాధించింది. ఇప్పుడు దేశం గర్వించే రీతిలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. 22 ఏళ్ల మలాలా.. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం(ఆక్స్ఫర్డ్ లేడీ మార్గరెట్ హాల్ కళాశాల)లో తత్వశాస్త్రం, రాజనీతి, ఆర్థిక శాస్త్ర విభాగంలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఈ ఆనందంలో కుటుంబంతో సరదాగా గడిపిన ఆమె.. తన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు.
'ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తయ్యాక నా ఆనందానికి అవధుల్లేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం చదువుకోవడం, నిద్ర పోవడంపైనే దృష్టిసారించాను. అయితే మానవ హక్కుల కోసం పోరాటం సాగిస్తాను.'
- మలాలా యూసఫ్జయ్
విదేశాలకు వెళ్లి..