పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో ప్రధాన నిందితుడిని అక్కడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి పేరు ఫైజుల్లా అని, కరాక్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రధాన పోలీస్ అధికారి సనావుల్లా అబ్బాసి వెల్లడించారు. అల్లరి మూకలను ప్రేరేపించి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయించిన కేసులో ఫైజుల్లానే సూత్రధారి అని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 110 మందిని అరెస్టు చేసినట్లు అబ్బాసి తెలిపారు.
ఇదీ చదవండి :పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన అల్లరిమూక