తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధానిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టిన మహింద - Srilanka PM Mahinda Rakapaksa

శ్రీలంక ప్రధానమంత్రిగా మహింద రాజపక్స మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రక బౌద్ధ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మహింద.

Mahinda Rajapaksa takes oath as Sri Lankan Prime Minister
ప్రధానిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన మహీంద

By

Published : Aug 9, 2020, 11:09 AM IST

శ్రీలంక పార్లమెంట్​ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీలంక పీపుల్స్​ పార్టీ(ఎస్​ఎల్​పీపీ) అధ్యక్షుడు మహింద రాజపక్స.. ప్రధానమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ కొలొంబో, కెలానియా ప్రాంతంలోని చారిత్రక బౌద్ధ మందిరమైన రాజమాహా విహారయాలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.

అయితే.. కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం జరగనున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని స్పష్టం చేసింది.

ఘన విజయం..

ఆగస్టు 5న జరిగిన ఎన్నికల్లో మహింద.. అఖండ విజయం సాధించారు. 5 లక్షల వ్యక్తిగత ప్రాధాన్యం ఓట్లను కైవసం చేసుకొని చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో మహింద నేతృత్వంలోని ఎస్​ఎల్​పీపీ పార్టీ జయభేరీ మోగించింది. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 225 పార్లమెంట్ స్థానాల్లో సంకీర్ణ పక్షాలతో కలిపి 150 సీట్లను గెలుచుకుంది.

ఇదీ చదవండి:గుడ్​న్యూస్: ఈ నెల 12న తొలి కరోనా వ్యాక్సిన్‌

ABOUT THE AUTHOR

...view details