శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో గొటబాయ రాజపక్స పార్టీ 'శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్' ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయఢంకా మోగించారు రాజపక్స సోదరులు. మొత్తం 225 స్థానాలకు గాను 145 సీట్లను కైవసం చేసుకున్నారు.
గతేడాది నవంబర్లో గొటబాయ రాజపక్స అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి మహిందా రాజపక్స ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకమని రాజపక్స సోదరులు వ్యాఖ్యానించారు. అంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీ తమకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారని మహిందా ట్వీట్ చేశారు.