తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2021, 7:27 AM IST

ETV Bharat / international

మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం ధ్వంసం

పాకిస్థాన్​, లాహోర్‌ కోటలో నెలకొల్పిన సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ కాంస్య విగ్రహాన్ని ఓ అరాచకవాది మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అజ్ఞానులే పాక్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరం అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

maharaja ranjit singh statue vendalised
మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం ధ్వంసం

పాకిస్థాన్‌లోని లాహోర్‌ కోటలో ఉన్న సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ కాంస్య విగ్రహాన్ని ఓ అరాచకవాది మంగళవారం ధ్వంసం చేశాడు. నిషేధిత తెహ్రీక్‌-ఇ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌(టీఎల్‌పీ) సంస్థకు చెందిన అతడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఆ వ్యక్తి గట్టిగా నినాదాలు చేస్తూ విగ్రహం చేతిని విరగ్గొట్టి, గుర్రంపై కూర్చున్నట్లున్న రంజిత్​ సింగ్‌ బొమ్మను కూలదోసి నేలమీద విసిరేయడం కనిపించింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అజ్ఞానులే పాక్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరం అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది పాక్‌ గౌరవానికి భంగం కలిగించే యత్నం అని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యేక రాజకీయ ప్రతినిధి షాబాజ్‌ గిల్‌ వ్యాఖ్యానించారు. 2019 జూన్‌లో నెలకొల్పిన ఈ విగ్రహంపై గతేడాదీ దాడి జరిగింది.

మైనార్టీల్లో భయం కలిగించే చర్య: భారత్‌

రంజిత్‌ సింగ్‌ విగ్రహ ధ్వంసం ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడుల వల్ల మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని పేర్కొంది. వీటిని అరికట్టడంలో పాక్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

ఇదీ చదవండి:శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు

'తాలిబన్ల చేతిలో చావు కోసం ఎదురుచూస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details