భారత్- చైనా సరిహద్దుల్లో దశాబ్దాల తర్వాత నెత్తురు పారింది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని గాల్వన్ లోయలో రెండు దేశాల సైనిక బృందాల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే చైనా దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తైవాన్, హాంకాంగ్ దేశాల ప్రజలు భారత్‌కు మద్దతిచ్చారు.
ఆయా దేశాలకు చెందిన కొందరు నెటిజన్లు.. చైనా తన బలానికి నిదర్శనంగా భావించే డ్రాగన్‌పై భారత్‌లో దేవుడిగా పూజించే రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు గ్రాఫిక్ ఫొటో రూపొందించారు. అవి కాస్తా అక్కడి సోషల్ మీడియాతో పాటు భారత్‌లోనూ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోపై "చంపుతాం.. జయిస్తాం" అనే స్లోగన్‌ను రాసి పరోక్షంగా చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. అమెరికా, ఇంగ్లాండ్, బెల్జియం, జపాన్, భారత్ మిత్రదేశాలని వారు పేర్కొన్నారు. ఈ ఫొటోలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.