మిడతల దండు విధ్వంసంతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ వాటిని అదుపుచేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. దీనికోసం భారత్‌పై విధించిన వాణిజ్య ఆంక్షలను సడలించడానికి సిద్ధమవుతోంది.
భారత్ నుంచి క్రిమిసంహారకాలను దిగుమతి చేసుకోవడానికి ఆంక్షలకు ఒకసారి మినహాయింపు ఇచ్చేందుకు పాక్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అక్కడి డాన్ పత్రిక వెల్లడించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించినట్లు పేర్కొంది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది పాక్. ఏడు నెలల అనంతరం ఈ ఆంక్షలను సడలించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.