మసూద్ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది: చైనా జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించకుండా అడ్డుకుంటున్న చైనా వైఖరిలో ఎట్టకేలకు మార్పు వచ్చినట్టుంది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కృతం అవుతుందని వ్యాఖ్యానించింది.
"మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కారం అవుతుందని భావిస్తున్నా." - గెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, పుల్వామా ఉగ్రదాడికి కారణమైన అజార్‌ను ఎప్పటిలోగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తారనే విషయంపై డ్రాగన్ దేశం స్పష్టతనివ్వలేదు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సమావేశమైన రెండు రోజులకే ఈ ప్రకటన వచ్చింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు చైనాపై చాలా కాలంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.
ఇదీ చూడండి: న్యూజిలాండ్‌లో బాంబు కలకలం