చైనా జాతీయ పండుగ వేడుకల్లో వెలుగుల మ్యాజిక్ అక్టోబరు 1న జరగబోయే చైనా 70వ వ్యవస్థాపక దినోత్సవం సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. వైవిధ్యమైన విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబైన భవనాలు, సంప్రదాయ సంగీతాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు కొత్త కళను సంతరించుకున్నాయి.
హాంకాంగ్‌లో ఘనంగా సంబరాలు
పర్యాటకులకు ఆకర్షణీయ ప్రాంతమైన హాంకాంగ్ విక్టోరియా హార్బర్లో చైనా జాతీయోత్సవాలు ఆహ్లాదంగా సాగాయి. విద్యుత్ దీపాలతో చేసిన రకరకాల ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
టిబెట్‌లోనూ చైనా జాతీయోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రోడ్లు, భవనాలు అన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోయాయి. సంప్రదాయ నృత్యాలు, సంగీతాలతో వేడుకలు ఘనంగా సాగాయి.
ఇదీ చూడండి : 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'