మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా.. ఆంక్షలను సైతం లెక్క చేయక పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు ప్రజలు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, నిర్బంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు రెండోవారానికి చేరాయి.
మయన్మార్లో ఆగని పౌర నిరసనలు
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న పౌర నిరసనలు రెండోవారానికి చేరాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్బంధంలోని ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు ప్రజలు.
మయన్మార్లో రెండోవారానికి పౌర నిరసనలు
మయన్మార్లో ఆందోళనలను అణచివేసేందుకు నిరసనలపై నిషేధం విధించింది సైన్యం. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడవద్దని హెచ్చిరించింది. అయినప్పటికీ.. అతిపెద్ద నగరాలైన యాంగూన్, మాండలేయల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. పరిశ్రమల కార్మికులు, పౌర సేవకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ట్రాన్స్జెండర్లు, బౌద్ధ మత గురువులు, ప్రచారకులు, క్రైస్తవులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి:'ప్రజాస్వామ్యం కోసం మాతో చేతులు కలపండి'