తెలంగాణ

telangana

ETV Bharat / international

ముగిసిన లంక ఎన్నికలు..ఫలితాలపై భారత్​, చైనా ఆసక్తి - నిశితంగా గమనిస్తోన్న భారత్​, చైనా...

శ్రీలంకలో నూతన అధ్యక్ష ఎన్నికలు పలు  అవాంఛనీయ ఘటనలతో ముగిశాయి. మొత్తం 80 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఆ దేశ ఎన్నికల అధికారులు తెలిపారు.

ముగిసిన లంక అధ్యక్ష ఎన్నికలు..ఫలితాలపై భారత్​, చైనా ఆసక్తి

By

Published : Nov 16, 2019, 11:28 PM IST

ఈస్టర్ బాంబు పేలుళ్ల తర్వాత భద్రతా సవాళ్లతో పోరాడుతున్న శ్రీలంకలో నూతన అధ్యక్షుడి ఎన్నికల పోలింగ్‌ ఈరోజు కొన్ని అవాంఛనీయ ఘటనలతో ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 5 గంటల వరకు సాగింది. దేశవ్యాప్తంగా మొత్తం 12,845 పోలింగ్​ కేంద్రా​లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

80 శాతం పోలింగ్​...

శ్రీలంక వ్యాప్తంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది.

35 మంది అభ్యర్థులు..

లంక అధ్యక్ష ఎన్నికల బరిలో ఈ సారి రికార్డు స్థాయిలో 35 మంది అభ్యర్థుల నిలిచారు. వారి భవితవ్యాన్ని బ్యాలెట్​ పేపర్లలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. ప్రధాన పోటీ మాత్రం 'యునైటెడ్ నేషనల్ పార్టీ'కి చెందిన సాజిత్ ప్రేమదాస, 'శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ'కి చెందిన గోటబయా రాజపక్సల మధ్యే నెలకొంది.

ఎన్నికల ప్రక్రియ సజావుగా...

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించామని.. ఈ ఘనత సాధించినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఎన్నికలు ముగిసిన అనంతరం చెప్పారు శ్రీలంక ప్రధాని రణిల్​ విక్రమసింఘే.

26 అంగుళాల బ్యాలెట్​ పేపర్..

ఈ ఎన్నికల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 12,845 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది శ్రీలంక ఎన్నికల సంఘం. మొట్ట మొదటి సారి 26 అంగుళాల బ్యాలెట్​ పేపర్​ను వినియోగించినట్లు అధికారుల స్పష్టం చేశారు.

26 మంది అరెస్టు...

ఎన్నికల సందర్భంగా దాదాపు 400,000 మంది ఎన్నికల అధికారులు, 60,000 మంది పోలీసు సిబ్బంది, 8,000 మంది సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (సిడిఎఫ్) సిబ్బందిని శాంతిభద్రతల కోసం నియమించారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో 69 అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయని... 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారుల తెలిపారు. ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి.

నిశితంగా గమనిస్తోన్న భారత్​, చైనా...

లంకేయులు నూతన సారథిగా ఎవరిని ఎన్నుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నందున భారత్‌, చైనాలు.. శ్రీలంక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అధ్యక్షుడి ఎన్నికలు ముగిసినందున.. ఇప్పుడు అవలంబించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నాయి.

ఇదీ చూడండి:కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ 'భారత్​ బచావో'

ABOUT THE AUTHOR

...view details