తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రదాడిపై 10 రోజుల ముందే సమాచారం..! - ఆత్మాహుతి

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో పెను విషాదం అలుముకుంది. ఎటు చూసినా క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఉగ్రదాడిపై నిఘా సంస్థలు 10 రోజులే ముందే హెచ్చిరించినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఉగ్రదాడిపై 10 రోజుల ముందే సమాచారం..!

By

Published : Apr 21, 2019, 2:16 PM IST

ఒకటి కాదు... రెండు కాదు... 6 వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లతో కొలంబో సహా మరో రెండు నగరాలు దద్దరిల్లాయి. అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

ఊహించడానికి వీలుకాని ఉగ్రదాడిపై నిఘా సంస్థలు 10 రోజుల ముందే సమాచారమివ్వడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
శ్రీలంక పోలీస్​ చీఫ్ పుజుత్ జయసుందర ఏప్రిల్​ 11నే ఉన్నతాధికారులకు కొద్ది రోజుల్లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని సమాచారమిచ్చారు.

విదేశీ నిఘా సమాచారం...

ఓ విదేశీ నిఘా సంస్థ సైతం శ్రీలంకలోని పలు ప్రఖ్యాత చర్చిలపై ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది. ఎన్​టీజే (నేషనల్ థోవీత్ జమాత్) ఈ దాడులకు ప్రయత్నిస్తుందని పేర్కొంది.

ఎవరీ ఎన్​టీజే...

ఎన్​టీజే గత సంవత్సరం శ్రీలంకలోని బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details