తెలంగాణ

telangana

ETV Bharat / international

'శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులకు కుట్ర?' - భద్రతా తనిఖీలు

శ్రీలంక రాజధాని కొలంబోలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఆ దేశ నిఘా వ్యవస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పటిష్ఠ భద్రత చేపట్టింది. దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు విస్త్రతం చేసింది.

'శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులకు కుట్ర?'

By

Published : May 3, 2019, 11:24 PM IST

'శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులకు కుట్ర?'

శ్రీలంకలో మరోసారి ఈస్టర్​ సండే తరహ మారణహోమం జరిగే అవకాశముందని ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరించాయి. మే 6 లోపు దేశ రాజధాని కొలంబోలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళిక వేసినట్లు సమాచారం అందించాయి. కొలంబో నగరంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే వంతెనలు, ఇతర బ్రిడ్జీలను పేల్చివేసే అవకాశముందన్నాయి. రాజధానిలో అధికారులు భద్రతాను కట్టుదిట్టం చేశారు.

"దేశవ్యాప్తంగా సైన్యం, ఇతర భద్రతా దళాలు విస్తృతస్థాయిలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు, వారి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పట్టుకోవడానికి పోలీసులూ విస్తృత స్థాయిలో గాలిస్తున్నారు. ఇందు కోసం అవసరమైన అదనపు సైనిక దళాలను ఏర్పాటు చేస్తున్నాం." - శ్రీలంక సైనిక దళం

ఈస్టర్ సండే మారణకాండలో 253 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మంది క్షతగాత్రులయ్యారు. ఈ దాడులను నిఘా సంస్థ ముందే హెచ్చరించినప్పటికీ ఉగ్రదాడులను అడ్డుకోవడంలో విఫలయయ్యామని శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది.

ఇదీ చూడండి: మార్పిడి కోసం డ్రోన్​లో కిడ్నీ తరలింపు

ABOUT THE AUTHOR

...view details