తూర్పు తైమూర్, ఇండోనేసియా దీవుల్లో 'సెరోజా' తుపాను కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ఉద్ధృతికి వంతెనలు, రోడ్లు తెగిపోయాయి. దీంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గల్లంతయ్యారు.
ఇండోనేసియాలో కొండ చరియలు విరిగిపడటం వల్ల పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిలో నివసిస్తున్న 73 మంది మరణించారు. పలు దీవుల్లో రహదారులు, వంతెనలు తెగిపోవడం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, భారీ పరికరాలు లేకపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది.
తూర్పు తైమూర్‌లో విపత్తు కారణంగా 27 మంది దుర్మరణం పాలయ్యారు.
అర్ధరాత్రి విపత్తు
తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్‌లోని అడొనరా ద్వీపంలో ఆదివారం అర్ధరాత్రి లామెనెలా గ్రామంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 38 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. తుపాను ధాటికి పశ్చిమ నుసా తెంగ్గారాలో ఇద్దరు, మరికొన్ని చోట్ల మరో 33 మంది మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సిబ్బంది వరద ప్రభావానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు లావాలో చిక్కుకొని మరో 42 మంది సజీవ సమాధి
సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు మృతదేహాలను వెలికితీస్తున్న సిబ్బంది తూర్పు నుసా తెంగ్గారాలోని ఇలి లెవొటోలోక్ ద్వీపంలో అగ్నిపర్వతం నుంచి సమీప గ్రామాలకు టన్నులకొద్దీ లావా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా ఇది ఘనీభవిస్తుండగా దీని కింద చిక్కుకొని 42 మంది సజీవ సమాధి అయ్యారు! వరద ఉద్ధృతికి ఈ ప్రాంతంలో ఐదు వంతెనలు, నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. వేల మంది స్థానికులు ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
ఇదీ చదవండి :బంగ్లాదేశ్‌లో లాంచీ మునక.. 27 మంది దుర్మరణం