గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు వాయవ్య పాకిస్థాన్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇప్పవరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. 250కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పాక్లో వరదల బీభత్సం-48 మంది మృతి - floods news
పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబెర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వారం రోజుల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు, 67 మంది గాయపడ్డారు. 250కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పాక్లో వరదల బీభత్సం
ఖైబెర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని స్వాత్, బ్యూనెర్, షాంగ్ల, కొహిస్తాన్, చిత్రాల్ జిల్లాలు నీట మునిగాయి. రోడ్లపై విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. పర్యటకులు, స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: 'భారతీయుల ఆశయాలను కరోనా సంక్షోభం అడ్డుకోలేదు'