తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ ఒక్క నగరంలోనే 6.7 లక్షల దొంగ కరోనా కేసులు! - asymptomatic CORONA CASES

పాకిస్థాన్​లోని లాహోర్​ నగరంలో లక్షణాలు లేని కరోనా కేసులు 6 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. కొవిడ్​ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందున వైద్య సదుపాయాలను ముమ్మరం చేయాలని పంజాబ్​ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Lahore might have an estimated 670,000 asymptomatic COVID-19 cases: Report
ఆ ఒక్క నగరంలోనే 6.7 లక్షల దొంగ కరోనా కేసులు!

By

Published : Jun 2, 2020, 7:35 PM IST

పాకిస్థాన్​లోని పంజాబ్​ రాజధాని లాహోర్​లో.. లక్షణాలు లేని కరోనా కేసులు లక్షల్లో ఉండొచ్చని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 1కోటి 20లక్షల జనాభా ఉన్న లాహోర్​లో సుమారు 6లక్షల 70వేలమంది ఇప్పటికే ఈ దొంగ కరోనా బారిన పడి ఉండొచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పంజాబ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. వైరస్​ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉన్నందున.. వైద్య సదుపాయాలను సిద్ధం చేసి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సూచించింది.

పరిస్థితిని అదుపు చేయాలంటే.. నగరమంతా మరో నాలుగు వారాలపాటు లాక్​డౌన్​లోనే ఉండాలని నివేదిక తేల్చిచెప్పింది. అయితే గత వారంలోనే రాష్ట్రంలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27వేలకుపైగా కొవిడ్​ బాధితులు ఉన్నారు. కరోనాతో పాక్​లో అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో పంజాబ్​ ఒకటి. పాక్​లో మంగళవారం మరో 3,938 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 76,798కి పెరిగింది. ఇప్పటివరకు 1,621మంది ప్రపంచ మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చూడండి:అమెరికాను రక్షించుకుంటామని ట్రంప్​ శపథం

ABOUT THE AUTHOR

...view details