తెలంగాణ

telangana

ETV Bharat / international

ముషారఫ్ పిటిషన్​ను తిరస్కరించిన లాహోర్ హైకోర్టు - ముషారఫ్ తీర్పు

ప్రత్యేక కోర్టు తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్​ను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. పూర్తి బెంచ్ అందుబాటులో లేని కారణంగా అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ముషారఫ్ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాలన్నింటిపై జనవరి 9న విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Lahore High Court returns Musharraf's application against his conviction
ముషారఫ్ పిటిషన్​ను తిరస్కరించిన లాహోర్ హైకోర్టు

By

Published : Dec 28, 2019, 3:47 PM IST

ప్రత్యేక కోర్టు తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వేసిన పిటిషన్​ను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులు సెలవుల్లో ఉన్నారని, దీంతో పూర్తి ధర్మాసనం అందుబాటులో లేదన్న కారణంతో అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముషారఫ్ దరఖాస్తును ఆయన తరపు న్యాయవాదికి అప్పగించింది. జనవరి తొలి వారంలో మరోసారి వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్ సూచించినట్లు పాకిస్థాన్ పత్రిక డాన్ ప్రకటించింది.

తనపై వచ్చిన అన్ని ఆరోపణలు సహా ప్రత్యేక కోర్టు చేసిన దర్యాప్తునకు వ్యతిరేకంగా ముషారఫ్​ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాలన్నింటిపై జనవరి 9న లాహోర్ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

రాజ్యాంగ విరుద్ధం

ప్రత్యేక కోర్టు విధించిన శిక్ష అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పేర్కొన్నారు ముషారఫ్. తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయని తెలిపారు. దర్యాప్తు పూర్తి కాకుండానే ఆగమేఘాలమీద విచారణ చేపట్టి తీర్పు వెలువరించిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details